Women Reservation Bill: కాసేపట్లో రాజ్యసభలో మహిళా బిల్లుపై ఓటింగ్‌

Women Reservation Bill: 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు 186 అనుకూల ఓట్లు

Update: 2023-09-21 12:34 GMT

Women Reservation Bill: కాసేపట్లో రాజ్యసభలో మహిళా బిల్లుపై ఓటింగ్‌

Women Reservation Bill: కాసేపట్లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్‌ జరగనుంది. ప్రస్తుతం సభలో బిల్లుపై చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల అనంతరం బిల్లుకు ఓటింగ్ నిర్వహించనున్నారు. నిన్న లోక్‌సభలో భారీ మెజారిటీతో మహిళా బిల్లు ఆమోదం పొందగా.. రాజ్యసభలో కూడా దాదాపు లైన్ క్లియర్‌ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందితే మహిళా బిల్లు చట్టరూపం దాల్చనుంది.

లోక్‌సభలో 456 మంది సభ్యులు ఉండగా.. 454 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. ఇద్దరు ఎంఐఎం ఎంపీలు వ్యతిరేకంగా ఓట్లు వేయగా.. రాజ్యసభలో అలాంటి అడ్డంకులు కూడా కనిపించడం లేదు. దీంతో రాజ్యసభలో కూడా బిల్లు దాదాపు పాస్ అవడం ఖాయమనే విశ్లేష‎ణలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో మొత్తం 229 మంది సభ్యులుండగా.. బీజేపీకి 95, కాంగ్రెస్‌కు 29, టీఎంసీకి 13 మంది ఎంపీలు... డీఎంకేకు 10, ఆప్‌కు 8మంది ఎంపీల బలం ఉంది.

Tags:    

Similar News