Karnataka Assembly Elections: సెల్ఫీతో ఓటు..కర్ణాటక ఎన్నికల్లో న్యూ రూటు
Karnataka Assembly Elections: ముందుగా ఓటర్లు తమ మొబైల్ లో చునావన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
Karnataka Assembly Elections: ముందుగా ఓటర్లు తమ మొబైల్ లో చునావన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ను ఓపెన్ చేసి అది సూచించిన విధంగా ఓటర్ ఐడీ నంబర్ తో పాటు మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి..ఆ తర్వాత ఓటర్ తన సెల్ఫీని అప్ లోడ్ చేయాలి. పోలింగ్ బూత్ కు వెళ్లిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ స్కాన్ చేయించుకోవాలి. ఎన్నికల కమిషన్ డేటా బేస్ తో ఓటర్ ఫోటో సరిపడితే వెంటనే మనం ఓటేయొచ్చు. ఇందుకు మనం ఎలాంటి పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
సాధారణంగా మనం ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడాలి. అక్కడ సిబ్బంది మన ఓటర్ ఐడీని చెక్ చేసి ఓటు వేసేందుకు అనుతమి ఇస్తారు. దీనికి కొంత సమయం పడుతుంది. కానీ చునావన యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ఆ వెయిటింగ్ ఉండదు. అంతేకాదు, బోగస్ ఓట్లు, ఎన్నికల అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని ఈసీ భావిస్తోంది.
ఈ సెల్ఫీ దిగు...ఓటు వెయ్ అనే కాన్సెప్ట్ ను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బెంగళూరులోని ప్రభుత్వ రామ్ నారాయణ్ చెల్లారం కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేవలం రూం.నంబర్ 2లో మాత్రమే అమలు చేయనున్నారు. యాప్ పనితీరును బట్టి భవిష్యత్ లో మిగిలిన చోట్ల కూడా ఉపయోగిస్తారు.