VaravaraRao Tests Corona Positive: వరవరరావుకు కరోనా పాజిటివ్
VaravaraRao Tests Corona Positive: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా సోకింది. ఈ సోమవారం వరకు జైల్లో ఉన్న ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
VaravaraRao Tests Corona Positive: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా సోకింది. ఈ సోమవారం వరకు జైల్లో ఉన్న ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి ముంబైలోని జేజే ఆసుపత్రికి వరవరరావును తరలించారు. అయితే ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన్ను ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.కాగా ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ఆయన కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఖంగారుపడిన కుటుంబసభ్యులు వరవరరావును వెంటనే విడుదల చేయాలనీ కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.. అంతేకాదు ఆయన విడుదలను కోరుతూ మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వరవరరావు ఇద్దరు కూతుళ్లు, అలాగే వామపక్ష పార్టీల నేతలు లేఖలు రాశారు. కాగా భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
గత నెల ప్రత్యేక కోర్టు ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది, వయస్సు మరియు ఇతర వైద్య పరిస్థితుల కారణంగా వైరస్ కు గురయ్యే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, వైద్య సదుపాయం అవసరమయ్యే సందర్భాలలో తగిన చర్యలు తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశించినట్లు కోర్టు తెలిపింది.