Vinesh Phogat: పోరాట ఫలితం.. ధిక్కారానిదే విజయం
Vinesh Phogat: తను అందరిలా తల వంచుకుని నిల్చో లేదు. బలమైన అధికారాలను కలిగి ఉన్న రాజ్యాన్ని ఎదుర్కొంది. అంతేనా నిలదీసింది..ప్రశ్నించింది..చివరకు ప్రపంచ క్రీడా వేదిక మీద సగర్వంగా తల ఎత్తుకుని తన నిర్ణయాన్ని ప్రకటించింది. తీవ్ర భావోద్వేగానికి లోనవుతూనే తను ప్రాణ పదంగా ప్రేమించిన, ఊపిరి కంటే ఎక్కువగా ఆరాధించిన మల్ల యుద్దం క్రీడా రంగం నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించింది.
Vinesh Phogat: తను అందరిలా తల వంచుకుని నిల్చో లేదు. బలమైన అధికారాలను కలిగి ఉన్న రాజ్యాన్ని ఎదుర్కొంది. అంతేనా నిలదీసింది..ప్రశ్నించింది..చివరకు ప్రపంచ క్రీడా వేదిక మీద సగర్వంగా తల ఎత్తుకుని తన నిర్ణయాన్ని ప్రకటించింది. తీవ్ర భావోద్వేగానికి లోనవుతూనే తను ప్రాణ పదంగా ప్రేమించిన ఊపిరి కంటే ఎక్కువగా ఆరాధించిన మల్ల యుద్దం నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్బంగా సమున్నత భారతావనిని ఉద్దేశించి మాజీ మల్ల యోధురాలు (రెజ్లర్) వినేష్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలు 143 కోట్ల మంది భారతీయులను విస్తు పోయేలా చేసింది. తను ఒంటరిని కానని, మీ అందరి ఆదరాభిమానాలతో తాను రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఆమెను తక్కువ చేసేందుకు ప్రయత్నం చేశారు. అంతే కాదు అనరాని మాటలు అన్నారు. వినేష్ ఫోగట్ వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా నానా రకాలుగా దుష్ప్రచారం చేశారు. అయినా అన్నింటిని భరించింది..అవమానాలను ఎదుర్కొంది. ఖాకీల దాష్టీకాన్ని దాటుకుని సగర్వంగా నిలిచింది.
మల్ల యుద్దం లోనైనా బయట సమాజంలో నైనా తన ధిక్కారం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించింది వినేష్ ఫోగట్. హర్యానా రాష్ట్రానికి చెందిన ఆమె జీవితం అంతా కష్టాల మయమే. కానీ అడుగడుగునా ఇబ్బందులను ఎదుర్కొంటూనే దేశం గర్వించే స్థాయికి క్రీడాకారిణిగా ఎదిగింది. తన ప్రతిభా పాటవాలతో , అద్భుతమైన ప్రదర్శనలతో అవార్డులు, పురస్కారాలు, పతకాలను సాధించింది.
దేశం గర్వించ దగిన ఈ మల్ల యోధురాలు ఏకంగా లైంగిక వేధింపులపై యుద్దం ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ , జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేసింది. తన లాంటి వారు ఎందరో రెజ్లర్లుగా రావాలని అనుకుంటున్నారని, కానీ బ్రిజ్ భూషణ్ కారణంగా రాలేక పోతున్నారన్నారు. ఉన్న వారంతా లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేనా బహిరంగ పోరాటానికి పిలుపునిచ్చింది. తనతో పాటు రెజ్లర్లతో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. దేశమే కాదు యావత్ ప్రపంచం వినేష్ ఫోగట్ చేసిన పోరాటాన్ని కళ్లారా చూసింది. సామాజిక మాధ్యమాలలో వినేష్ ఫోగట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి కాల్చివేతకు గురయ్యాడు. ఆనాటి నుంచే నేటి దాకా పోరాడటం, ప్రశ్నించడమే పనిగా పెట్టుకుంది. తన లాంటి వారు ఇంకెప్పుడూ లైంగిక వేధింపులకు గురి కావద్దని పిలుపునిచ్చింది. మోడీ సర్కార్ స్పందించ లేదు..సరికదా ఆమెపై అభాండాలు వేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఫీనిక్స్ పక్షి లాగా వినేష్ ఫోగట్ తగ్గలేదు.
అంతే కాదు రైతుల పోరాటానికి మద్దతు పలికింది. వారు లేక పోతే దేశానికి అన్నం ఎవరు పెడతారంటూ ప్రశ్నించింది. ఏ పదవినైతే అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్నారో, అధికార దర్పంతో ఊరేగుతున్నారో వారందరికీ తాను చెంప చెళ్లుమనిపించేలా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది వినేష్ ఫోగట్. కాంగ్రెస్ పార్టీ నుంచి జులాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఆమెను ఓడించేందుకు భారతీయ జనతా పార్టీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసింది. కుట్రలు పారలేదు..జిమ్మిక్కులు వర్కవుట్ కాలేదు..6 వేలకు పైగా ఓట్లతోవినేష్ ఫోగట్ విజయం సాధించింది. ప్రత్యర్థులను విస్తు పోయేలా చేసింది. ఆమె ఒంటరి కాదని నిరూపించింది. ఈ గెలుపు మహిళలకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని చెప్పక తప్పదు.