కోర్టు ధిక్కరణ కేసులో విజయ్‌మాల్యాకు జైలు శిక్ష
Vijay Mallya: మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధించిన సుప్రీంకోర్టు
Vijay Mallya: కోర్టు ధిక్కరణ కేసులో విజయ్‌మాల్యాకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. 48 మిలియన్ డాలర్లను పిల్లల పేరుపై బదిలీ చేశారు విజయ్‌మాల్యా. దీంతో.. 4 వారాల్లోగా వడ్డీతో 48 మిలియన్ డాలర్లు చెల్లించాలని, లేనిపక్షంలో ఆస్తులను అటాచ్ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.