Venkaiah Naidu Letter to KCR: తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ కి ఉపరాష్ట్రపతి లేఖ!
Venkaiah Naidu Letter to KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేఖ రాశారు..
Venkaiah Naidu Letter to KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేఖ రాశారు.. ఈ లేఖలో ఉపరాష్ట్రపతి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు వెంకయ్యనాయుడు పుట్టినరోజు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా పూల బొకేను పంపించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడపాలని, రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని సేవలు అందించాలని కోరారు..
1947 జూలై 1న నెల్లూరు జిల్లాలోని చవటపాలెం అనే గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించారు వెంకయ్యనాయుడు. భారతీయ జనతా పార్టీకు చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు
.2010 మే 8న శాసనసభలో, రాజ్యసభలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం "అలుపెరుగని గళం విరామమెరుగని గళం." పేరుతో సంకలనం చేసి విడుదల చేయించారు..
2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయ్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసారు. ఇక మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. 2005 ఏప్రిల్లో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించారు.
ఆయన చేసిన సేవలకు గాను దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు ఎన్నుకోబడ్డారు. భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుతం కొనసాగుతున్నారు..