కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 93ఏళ్ల మోతీలాల్ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ సేవలందించారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వోరా మృతి చెందారు. మోతీలాల్ వోరా రెండుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా వోరా ఆదివారమే తన 93వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. అక్టోబర్‌లో కొవిడ్ బారిన పడిన వోరా.. ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. 1927లో జన్మించిన మోతీలాల్ వోరా, యుక్తవయసు నుంచే చాలా కాలం జర్నలిజంలో సేవలందించారు. అనంతరం 1968లో రాజకీయాల్లో అడుగుపెట్టి.. మధ్యప్రదేశ్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు.