Ayodhya: సరయూ నది తీరంలోని లతామంగేష్కర్‌ చౌక్‌లో భారీ వీణ

Ayodhya: వీణ పొడవు 40 అడుగులు, బరువు 14 టన్నులు

Update: 2022-09-22 06:55 GMT

Ayodhya: సరయూ నది తీరంలోని లతామంగేష్కర్‌ చౌక్‌లో భారీ వీణ

Ayodhya: రామజన్మభూమి అయోధ్య నగర సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నగరంలో పలు కూడళ్లలో విగ్రహాలు.. ఇతర నిర్మాణాలను చేపడుతోంది అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ. దీంట్లో భాగంగా అయోధ్యలోని సరయూ నది తీరంలో లతామంగేష్కర్‌ చౌక్‌లో అత్యంత భారీ వీణను ఏర్పాటు చేశారు. భారత శాస్త్రీయ సంగీత పరికరమైన ఈ వీణ సైజు 40అడుగుల పొడవు, 14టన్నుల బరువు ఉంది. నోయిడాలో రూపు దిద్దుకున్న భారీ వీణను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహ శిల్పి రామ్‌ వన్‌జీ సుతార్‌ తయారు చేశారు.

Tags:    

Similar News