వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

Update: 2020-07-02 07:50 GMT

భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు జైల్ లో వున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తలొజా జైల్ సిబ్బంది వరవరరావు భార్య కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయనకు తలొజా జైల్లో ఉన్న హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ సిబ్బంది తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు. ఇప్పటికే బెయిల్ కోసం పిటీషన్ వేయగా లోయర్ కోర్ట్ కొట్టేసింది. అనంతరం మహారాష్ట్ర హైకోర్టులో వరవరరావు బెయిల్ పిటీషన్‌‌ను వేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన వరవరరావును మొదట మహారాష్ట్ర పుణె లోని ఎరవాడ జైలుకు తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.

 

Tags:    

Similar News