భారత మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి భారీ విగ్రహం తుది మెరుపులు దిద్దుకుంటుంది. దాదాపుగా 25 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ శిల్ప కళాకారుడు రాజ్ కుమార్ పండిత్ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ విగ్రహ తయారి చేసే అదృష్టం తనకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, అయన స్పీచెస్ విని పెరిగానని అయన అన్నారు. మరో నెల రోజుల్లో ఈ విగ్రహం పూర్తి కానుంది.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు తరలించి, అక్కడ ప్రతిష్టించనున్నారు.
ఇక అటల్ బిహారీ వాజపేయి విషయాని వస్తే అయన 1924 డిసెంబర్ 25 న మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించారు. ఈయన బ్రహ్మచారి. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఆ పదవి 13 రోజులకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా 13 నెలలు ఉన్నారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నాడు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.