40 రోజుల పసికందుకు కరోనా.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని..

Vadodara: కరోనా కల్లోలం సృష్టిస్తోంది.

Update: 2022-01-23 13:17 GMT

40 రోజుల పసికందుకు కరోనా.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని..

Vadodara: కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ సోకితే ఎలా ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి.. నీరసం.. వంటి లక్షణాలతో ఎంత బాధ ఉంటుందో అనుభవించినవారకే తెలుసు.. కరోనా సోకిందని తెలిస్తే.. కుటుంబ సభ్యులు కూడా జాలి చూపించని పరిస్థితులను మనం చూశాం.. అలాంటిది రక్కసి.. 40 రోజుల పసిగుడ్డుకు సోకితే? ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది.

గుజరాత్‌లోని వడోదరలో ఓ 40 రోజుల పశికందుకు మహమ్మారి సోకింది. ఆ చిన్నారి రోదనలు ఆ తల్లి గుండెను రంపంలా కోస్తున్నాయి. ఆసుపత్రిలో సూట్‌ వేసుకుని ఏడుస్తున్న బిడ్డను తల్లి లాలిస్తోంది. చూస్తున్న ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది. వడోదరలోని నవపురా ప్రాంతానికి చెందిన 40 రోజుల శిశువు అస్వస్థతకు గురయ్యింది.

దీంతో జమ్నాబాయి జనరల్‌ ఆసుపత్రికి శిశువును తల్లిదండ్రులు తీసుకెళ్లారు. మొదట చిన్నారికి డయేరియా సోకిందని వైద్యులు భావించారు. అయితే పరిస్థితిలో మార్పు రాకపోవడంతో శిశువును ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగానికి తరలించారు.

ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రిలొ తల్లి, బిడ్డలకు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయగా పాజిటివ్‌గా నిర్ధారించారు. అయితే మొదట డయేరియాగానే తమ విభాగంలో చేర్చుకున్నట్టు డాక్టర్‌ షీలా అయ్యర్‌ తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్‌ షీలా వివరించారు.

డిసెంబరు 30న 8 నెలల బాబు కరోనాతో వడోదరలోని ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రిలోనే చేరాడు. చిన్నారి కరోనా నుంచి కోలుకుని జనవరి 7న డిశ్చార్జి అయినట్టు డాక్టర్‌ షీలా తెలిపారు. కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని చిన్నారులకు కూడా కరోనా సోకుతుందని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ షీలా హెచ్చరించారు. 

Tags:    

Similar News