Corona Curfew: క‌ర్ఫ్యూ ఎత్తివేయ‌నున్న ప్ర‌భుత్వం

Corona Curfew: క‌రోనా కేసుల తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో యూపీ ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ ఎత్తివేయనుంది.

Update: 2021-05-29 08:18 GMT

కర్ఫ్యూ ఎత్తివేయనున్న ఉత్తరప్రదేశ్ (ఫైల్ ఇమేజ్)

Corona Curfew: క‌రోనా కేసుల తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో యూపీ ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ ఎత్తివేయనుంది. యూపీలో ఏప్రిల్ 30 నుండి కర్ఫ్యూ అమలులో ఉంది. తొలుత‌ ఇది మే 3 వరకు అమలులో ఉన్న‌ప్ప‌టికీ, తరువాత దానిని మే 6 వరకు పొడిగించారు. అనంత‌ర ఈ క‌ర్ఫ్యూను మే 10 వ తేదీ వరకు పొడిగించారు. ఆ త‌రువాత మే 17, తిరిగి మే 31 వరకు క‌ర్ఫ్యూ పొడిగించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కరోనా కేసులు త‌గ్గిన‌ నేప‌ధ్యంలో వారాంతపు కరోనా కర్ఫ్యూను సడలించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు పరిమిత సిబ్బందితో కార్యాలయాలను తెరిచేందుకు అవ‌కాశం క‌ల‌గవ‌చ్చు.

జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టమైన సూచన చేసిన‌ప్ప‌టికీ, త‌క్కువ కేసులు ఉన్న‌రాష్ట్రాల్లో స‌డ‌లింపుల‌పై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. ఈ క‌ర్ఫ్యూ ప్రభావంతో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. కాగా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి కోవిడ్ టీకాలు వేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

రాష్ట్రంలో కర్ఫ్యూను దశలవారీగా ఎత్తివేయాల‌ని భావిస్తోంది. మే 31 తరువాత నుంచి నిబంధ‌న‌ల్లో కొంతమేర‌కు స‌డ‌లింపులు ఇవ్వ‌నున్నారు. జూన్ ఒక‌టి నుంచి ప్రభుత్వం మార్కెట్లను తిరిగి తెరిచేందుకు అనుమ‌తులు ఇవ్వ‌నుందని తెలుస్తోంది. మ‌రోసారి కేబినెట్ భేటీ జ‌రిపి నిర్ణ‌యం తీసుకోనుంది. 

Tags:    

Similar News