కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి!
జీనా పరిస్థితి విషమంగా ఉండటంతో కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. అయితే అయన మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సిధర్ భగత్ సంతాపం తెలిపారు.
కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది. అటు కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా మృతి చెందారు.. గత కొద్దిరోజులుగా ఢిల్లీ ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న అయన గురువారం తెల్లవారుజామున మరణించినట్లు డెహ్రాడూన్ పార్టీ అధికారులు తెలిపారు.
జీనా పరిస్థితి విషమంగా ఉండటంతో కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. అయితే అయన మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సిధర్ భగత్ సంతాపం తెలిపారు. అటు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సోషల్ మీడియా ద్వారా జీనా కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇక జీనా భార్య ధర్మాదేవి గుండెపోటుతో ఇటీవలే మరణించింది.
ఇక సురేంద్ర సింగ్ జీనా డిసెంబర్ 8 1969 వ సంవత్సరంలో అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో జన్మించారు. మొదటిసారి ఆయన బిక్యాసేన్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా.. ఆ తర్వాత అల్మోరా జిల్లా స్టాల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
అటు అంతకుముందు రాష్ట్ర పార్టీ చీఫ్ భగత్, ముగ్గురు క్యాబినెట్ మంత్రులు - సత్పాల్ మహారాజ్, హరక్ సింగ్ రావత్ మరియు మదన్ కౌశిక్ - కోవిడ్ -19 బారిన పడ్డారు, కాని వారంతా కోలుకున్నారు. ఇక బుధవారం వరకు ఉన్న సమాచారం మేరకు ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు 66,788 కేసులు నమోదయ్యాయి, వాటిలో 60,900 మంది కోలుకోగా, 1,086 మంది మరణించారు.