Kumbh Mela: ఏప్రిల్ 1 నుండి 30 వరకు కుంభమేళా

కరోనా వల్ల ఈ ఏడాది కుంభమేళాను 30 రోజులకు కుదించాం

Update: 2021-02-18 09:09 GMT

కుంభమేళా (ఫైల్ ఫోటో)

Kumbh Mela: హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభ‌మేళాను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఓం ప్ర‌కాశ్ తెలిపారు. కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మార్చి చివ‌రినాటికి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారమని... కరోనా వల్ల ఈ ఏడాది కుంభమేళాను 30 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కుంభమేళాకు తరలి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టలు చేయించుకోవాలని, రిపోర్టులో నెగిటివ్ వస్తేనే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.కోవిడ‌ రిపోర్టు లు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఘాట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. కుంభ పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు… భారతదేశంలోని నాలుగు ప్రదేశాల్లో అమృతాన్ని ధారపోశారు. అవే హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఈ నాలుగు ప్రదేశాల్లో గ్రహాలను అనుసరించి కుంభమేళా జరుగుతోంది. పురాణాల్లో చెప్పినట్లు ప్రయాగరాజ్‌లో త్రివేణీ సంగమ ప్రాంతంలో సరస్వతి నది అంతర్గతంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. మూడు దశాబ్దాలుగా నాసాతో కలిసి భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో నది ఉన్నట్లు స్పష్టమైంది. అంతర్గతంగా ప్రవహిస్తున్న సరస్వతి నది మార్గంలోనే యమునా నది ప్రవహిస్తోందని నమ్మకం.

కుంభ మేళాకీ, గంగానదికీ విడదీయరాని సంబంధం ఏర్పడింది. గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తే, సర్వ పాపాలూ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. వెయ్యి కార్తీక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వంద మాఘ మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వైశాఖ మాస స్నానాలు కోటి సార్లు నర్మదా నదిలో చేసిన ఫలితాన్ని… ఒక్కసారి కుంభ మేళా స్నానంతో మనం పొందుతామని స్కందపురాణం చెబుతోంది.

గంగా నది ప్రవాహం హిమాలయాల నుంచీ మొదలవుతుండటంతో… ఎప్పటికప్పుడు కొత్త జలంతో గంగానది తనను తాను ప్రక్షాళన చేసుకుంటోందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ గంగానదీ తీరంలో విష్ణుమూర్తి అమృతాన్ని ధార పోసిన ఈ ప్రాంతాలలో కుంభమేళాను చేయటం ఆనవాయితీగా వస్తోంది.

Tags:    

Similar News