Breaking News: ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ముసలం ఏర్పడింది. సొంత పార్టీ నేతలే సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై తిరుగుబాటు చేశారు.
Breaking News: ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ముసలం ఏర్పడింది. సొంత పార్టీ నేతలే సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై తిరుగుబాటు చేశారు. దీంతో సీఎం రావత్ పదవికీ రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజకీయాల్లో నేను ఎంతోకాలంగా పనిచేస్తున్నాను. నాలుగేళ్ల పాటు రాష్ట్రానికి సేవ చేసే సువర్ణావకాశం లభించింది. నేనో చిన్న గ్రామం నుంచి వచ్చాను. కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు కూడా ఇలాంటి గొప్ప అవకాశాలు రావడం కేవలం బీజేపీలోనే సాధ్యం. ఇప్పుడు అదే పార్టీ ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వమని చెప్పింది. రేపు ఈ పదవిని ఎవరు చేపట్టినా వారికి నేను సహకరిస్తా అని రావత్ ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా నూతన సీఎం పదవి పరిశీలనలో రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్, కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్లు ఉన్నాయి.