America: మయన్మార్ తో వాణిజ్య ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన అమెరికా
America: మయన్మార్ తో గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్నిసస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
America: మయన్మార్ తో గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్నిసస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. మయన్మార్ లో సైనిక ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా ఈ చర్యలను తీసుకున్నామని.. తిరిగి ప్రజాస్వామ్య పాలన మొదలైన తరువాతనే ఈ ఒప్పందం తిరిగి అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో మరిన్ని కఠిన నిర్ణయాలను ప్రకటిస్తూ, సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న మయన్మార్ ఎకనామిక్ హోల్డింగ్స్ లిమిటెడ్, మయన్మార్ ఎకనామిక్ కార్ప్ పై ఆంక్షలను విధించింది.
బర్మా ఆర్థిక వ్యవస్థను ప్రపంచ విపణికి అనుసంధానించే చర్యల్లో భాగంగా 2013లో ఇరు దేశాల మధ్య 'ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్' అనే ఒప్పందం కుదిరింది. తాజాగా దీన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి కేథరీన్ టాయ్ ప్రకటించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం బర్మా ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు.
అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వర్తక, వాణిజ్యం నిలిచిపోదు. కాకపోతే మయన్మార్‌పై అమెరికా కొన్ని ఆర్థికపరమైన ఆంక్షల్ని విధిస్తుంది. ఇప్పటికే తిరుగుబాటుకు వ్యతిరేకంగా సైన్యం ఆధ్వర్యంలో నడుస్తోన్న మయన్మార్ ఎకానమిక్ హోల్డింగ్స్ లిమిటెడ్, మయన్మార్ ఎకానమిక్ కార్ప్‌పై అగ్రరాజ్యంతో పాటు యూకే ఆంక్షల్ని విధించాయి. బర్మాలో తయారయ్యే వెచ్చటి దుస్తులు, గృహోపకరణాలకు అమెరికాలో గిరాకీ అధికం. తాజా ఆంక్షలతో బర్మా ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం పడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.