G20 Summit: ఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్
G20 Summit 2023: హస్తిన వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది.
G20 Summit 2023: హస్తిన వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. హస్తిన వేదికగా రేపు, ఎల్లుండి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఇప్పటికే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. మారిషస్, ఒమన్ ప్రధాని, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్ బెర్టో ఫెర్నాండీజ్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాసేపటి క్రితమే అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఢిల్లీ చేరుకున్నారు.
కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్, ఇతర ఉన్నాధికారులు ఉన్నారు. జో బైడెన్ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీతో భేటీ కానున్నారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించనున్నారు.