Donald Trump: మహాత్ముడికి నివాళులర్పించిన ట్రంప్ దంపతులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది.

Update: 2020-02-25 05:53 GMT
గాంధీ సమాధికి నివాళి అర్పిస్తున్న ట్రంప్ దంపతులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ట్రంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ దంపతులకు సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్‌కు ముందుగా త్రివిధ దళాలు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మోదీ పలువురు కేంద్ర మంత్రులను, ఉన్నతాధికారులను ట్రంప్‌కు పరిచయం చేశారు. ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌ చేరుకొని మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు.

రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని పొందు పరిచారు. ఈ సందర్భంగా భారత అధికారి ట్రంప్ కు గాంధీ ప్రతిమను అందించారు. ఆ ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం అక్కడి నుంచి ట్రంప్‌ తన సతీమణి మెలానియాతో కలిసి హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకున్నారు. భారత్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

   



 



Full View




Tags:    

Similar News