యూపీ బీజేపీలో వలసల పర్వం.. మరో మంత్రి ఔట్.. మరో 12 మంది పార్టీని వీడే ఛాన్స్..
UP Election 2022: అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ బీజేపీలో వలసల పర్వం మొదలైంది.
UP Election 2022: అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ బీజేపీలో వలసల పర్వం మొదలైంది. ఒకరి తర్వాత ఒకరుగా వరసగా పార్టీని వీడుతుండటం బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మొన్న స్వామి ప్రసాద్ మౌర్య, నిన్న దారాసింగ్ చౌహాన్, ఇవాల ధరం సింగ్ సైనీ ఇలా మంత్రులంతా పార్టీని వీడుతున్నారు. బీజేపీలో వెనుకబడిన వర్గాలు, దళితులకు రక్షణ లేదని, న్యాయం జరగదని ఆ నేతలు ఆరోపిస్తున్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఏ మాత్రం కృషి చేయడంలేదని వలస పోతున్న నేతలు ఆరోపిస్తున్నారు.
వీరంతా నేరుగా ఎస్సీ నేత అఖిలేష్ యాదవ్ ను కలవడం మరింత ఇబ్బంది కలిగిస్తోంది. త్వరలోనే మరో 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై కొట్టే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ పార్టీ ఆఫీస్ కు తాళం వేసుకోవచ్చని అఖిలేష్ నిన్న వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో అందరి దృష్టి ఈ రాష్ట్రం పైనే ఉంది.