UP Health Minister Corona Positive: యూపీ ఆరోగ్య శాఖ మంత్రికి క‌రోనా

UP Health Minister Corona Positive: మ‌న దేశంలో క‌రోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ క‌రోనా కేసుల్లో భార‌త్‌ 3వ స్థానానికి చేరింది.

Update: 2020-07-24 13:40 GMT

UP Health Minister Corona Positive: మ‌న దేశంలో క‌రోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ క‌రోనా కేసుల్లో భార‌త్‌ 3వ స్థానానికి చేరింది. వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 ల‌క్ష‌ల మార్కు  దాటిపోయింది. ఇక రాజ‌కీయ నాయ‌కులు, వైద్యులు, పోలీసులు, ప్ర‌ముఖ న‌టులు అనే తేడా లేకుండా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా, ఉత్త‌ర ప్ర‌దేశ్ ఆరోగ్యమంత్రి జై ప్రతాప్‌ సింగ్‌ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయ‌నకు స‌న్నిహితంగా ఉన్న వారిపై అధికారులు దృష్టి సారించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల నుంచి న‌మునాలు సేక‌రించారు.

బల్లియా జైలులో 160మంది ఖైదీలకు కరోనా

జైళ్ల‌లో ఉంటోన్న ఖైదీలు కూడా క‌రోనా కోర‌ల్లో చిక్కుకుంటున్నారు. ‌తాజాగా బల్లియా జైలులో 160 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జైలు సూపరింటెండెంట్‌ ప్రశాంత్‌ కుమార్‌ మౌర్య వెల్లడించారు. ఈ జైల్లో 594 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా వారిలో 160మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారని తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. మహిళా ఖైదీలకు సైతం పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిని బసంత్‌పూర్‌లోని ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పారు.

మ‌రోవైపు యూపీలోని ఝాన్సీ జైల్లోనూ 120 మంది ఖైదీలకు క‌రోనా పాజివిట్‌గా తేలింది. దీంతో వారిని ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచిన‌ట్టు అధికారులు తెలిపారు. యూపీలో నిన్న ఒక్కరోజే 2516 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు వచ్చిన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 58,104కి పెరిగింది. వీరిలో 35,803 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1289 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉన్న క‌రోనా కేసుల లిస్టులో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఆరో స్థానంలో ఉంది.

Tags:    

Similar News