నేటినుంచి సినిమా హాళ్లకు అనుమతి.. ఏపీలో బొమ్మ లేదు!

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో.. భారత్ లో కూడా ఏడు నెలల జాతీయ లాక్డౌన్ తరువాత.. దేశాన్ని తిరిగి తెరిచే ఆఖరు దశ గురువారం ప్రారంభమవుతుంది..

Update: 2020-10-15 01:54 GMT

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో.. భారత్ లో కూడా ఏడు నెలల జాతీయ లాక్డౌన్ తరువాత.. దేశాన్ని తిరిగి తెరిచే ఆఖరు దశ గురువారం ప్రారంభమవుతుంది.. నేడు సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి, థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ లను కూడా ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే యాభై శాతం ఆక్యుపెన్సీతో మాత్రం థియేటర్లను నడుపుకోవాలని కేంద్రం కండిషన్ పెట్టింది. ఇక ఏపీలో యాభై శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని, అందువల్ల తాము సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు.

సినిమా హాలులో కాకుండా నేటినుంచే దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని విద్యార్థులను తిరిగి తరగతి గదుల్లోకి పంపే ప్రక్రియ ప్రారంభం అవుతుంది, అయితే కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే పాఠశాలలను తెరవాలని నిర్ణయించాయి.. ఇందులోను దాదాపు అన్నింటిలో కూడా సీనియర్ తరగతుల విద్యార్థులు మాత్రమే హాజరుకావడానికి అనుమతిస్తారు. ఇక అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు పాఠశాలలను మరికొద్ది రోజులు మూసివేయాలని నిర్ణయించాయి. మరోవైపు నేటినుంచే మతపరమైన సమావేశాలను కూడా ఆంక్షలతో అనుమతిస్తారు.

అన్లాక్ 5.0పై  కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. 'శీతాకాలం మరియు పండుగ సీజన్ కారణంగా కరోనాకు వ్యతిరేకంగా మా పోరాటంలో రాబోయే రెండున్నర నెలలు చాలా కీలకమైనవి. సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి భద్రతా విధానాలను తగ్గించకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.. అలాగే ప్రభుత్వ నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అవుతుంది.' అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ బుధవారం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులతో జరిగిన సమావేశంలో అన్నారు. ఇదిలావుంటే బుధవారం నాటికి భారతదేశంలో 7,304,804 కరోనా కేసులు, 111,314 మరణాలు నమోదయ్యాయి. 

Tags:    

Similar News