Delhi Lockdown: 50రోజుల లాక్‌డౌన్ తర్వాత ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ

Delhi Lockdown: సోమవారం నుంచి సడలింపులు ప్రకటించిన కేజ్రీవాల్ * మెట్రో రైళ్లలో 50శాతం ప్రయాణికులకు అనుమతి

Update: 2021-06-05 10:00 GMT

ఢిల్లీ అన్ లాక్ ప్రక్రియ (ఫైల్ ఫోటో)

Delhi Lockdown: 50రోజుల లాక్‌డౌన్ తర్వాత ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుతుండడంతో సీఎం కేజ్రివాల్ పలు అన్‌లాక్ ప్రక్రియ పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి సడలింపులు ఇచ్చారు. దీంతో మెట్రో రైళ్లలో యాబై శాతం ప్రయాణికులను అనుమతించడంతోపాటు పలు మార్కెట్‌లోని షాపులకు సరి, బేసి విధానంలో తెరిచేందుకు అనుమతించారు. అయితే, ఈ నిబంధనలు జూన్ 14 వరకు కొనసాగనున్నట్టు తెలిపారు. అనంతరం పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.

మరోవైపు ప్రైవేటు సంస్థలకు యాబై శాతం సిబ్బందితో అనుమతి ఇచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో కొనసాగనున్నట్లు తెలిపారు. అయితే వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. లాక్‌డౌన్ కొనసాగుతుందని అయితే సరి, బేసి సంఖ్య విధానంలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు కొనసాగనున్నట్టు ప్రకటించారు. అంటే రాత్రీ ఎనిమిది గంటల నుండి ఉదయం పది గంటల వరకు కర్ఫ్యూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News