నవంబర్‌ 30 వరకూ కొనసాగనున్న అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలు!

కరోనా కట్టడి విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో ప్రకటించిన అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ కొనసాగుతాయని ప్రకటించింది.

Update: 2020-10-27 13:00 GMT

కరోనా కట్టడి విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో ప్రకటించిన అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ కొనసాగుతాయని ప్రకటించింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో పాటు అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలన్నీ నవంబర్‌ 30 వరకూ కొనసాగుతాయని స్పష్టం చేసింది. కోరోనా ముప్పు ఇంకా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశించింది. ప్రభుత్వం అనుమతించిన సేవలు మినమా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత యధావిధిగా కొనసాగుతాయని కేంద్రం వెల్లడించింది. దశలవారీగా స్కూళ్లు, కాలేజీలు తెరవడంపై ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఇందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని మరోమారు స్పష్టం చేసింది.

Tags:    

Similar News