Unlock 4.0: అన్‌లాక్ 4.0 సడలింపులు ఇవే.. మెట్రో రైళ్ళకు గ్రీన్ సిగ్నల్!

Unlock 4.0: అన్‌లాక్ 4.0 లో భాగంగా మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

Update: 2020-08-29 15:19 GMT

కరోనా వైరస్ నుంచి ప్రజల్ని రక్షించడానికి కొన్నిరోజుల పాటు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం తరువాత పరిస్థితులను అన్హనా వేస్తూనే.. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా అన్‌లాక్ 3.0 రేపటితో (ఆగస్టు 30) ముగియబోతోంది. దీంతో కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ ౧ నుంచి అన్‌లాక్ 4.౦ మార్గదర్శకాలను విడుదల చేసింది. 

అన్‌లాక్ 4.0లో భాగంగా పలు సడలింపులు ప్రకటించింది.

అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు ఇవే!

- సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లను ప్రారంభించుకోవడానికి అవకాశం.

- సెప్టెంబర్‌ 21 నుంచి ఇండోర్‌లో విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను జరుపుకొనేందుకు అవకాశం. 100 మంది వరకు అనుమతి.

- అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు. (హోం శాఖ అనుమతించిన ప్రయాణాలకు మినహాయింపు)

- సెప్టెంబర్‌ 21 నుంచి సామాజిక, విద్యా, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ తదితర కార్యక్రమాలను 100 మంది మించకుండా నిర్వహించుకోవచ్చు.

- కంటైన్మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు ఆంక్షల కొనసాగింపు.

- సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరిచేందుకు అనుమతి.

- సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్ల మూసివేత కొనసాగింపు.

- సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, థియేటర్లు లాంటి ప్రదేశాలకు అనుమతి నిరాకరణ.

- కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదు.

- అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలూ విధించకూడదు. వ్యక్తులు, సరకు రవాణాకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదు




Tags:    

Similar News