Unlock 4.0: అన్‌లాక్ 4.0: మెట్రోరైళ్లకు గ్రీన్ సిగ్నల్.. స్కూళ్లకు నో చెప్పే అవకాశం!
Unlock 4.0: కరోనా అన్‌లాక్-3 ముగియనున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్-4కు సంబంధించిన కేంద్రం మార్గదర్శకాలను సిద్ధం చేసింది.
Unlock 4.0: ఈ నెల ఆఖరుతో కరోనా అన్‌లాక్-3 ముగియనున్నది. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్-4కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సిద్ధం చేసింది. అయితే.. అన్‌లాక్- 4లో అసలు ఎలాంటి షరతులుండవనీ, అన్నింటికి అనుమతులు ఇస్తారానీ, అన్నీ తెరిచేస్తారనీ సోషల్‌మీడియాలో అసత్య ప్రచారాలు నడుతున్నాయి. అయితే .. వాటిలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదు. మన కేంద్రం కూడా డబ్యూహెచ్ ఓ నిబంధనలు ప్రకారమే నడుచుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. కాబట్టి... భారత్‌పై డబ్యూహెచ్ ఓ ఒత్తిడి ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్రం అన్‌లాక్ 4.0కు సంబంధించిన నూతన మార్గదర్శకాలను త్వరలో రానున్నాయి. కరోనా నియంత్రణ చర్యలను అమలు చేసుకుంటూనే.. అన్‌లాక్ 4.0లో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుకూలంగా కేంద్రం మెట్రో రైళ్ల సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు తెలిసింది. మార్చి 22న దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ఆగిపోయినా విషయం తెలిసిందే. దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. మెట్రో సర్వీసులు తెరిచాక... ఎలాంటి రూల్స్ పాటించాలో... ఈ వారాంతంలో గైడ్‌లైన్స్ వస్తాయని తెలిసింది. నూతన నిబంధనల్లో కాంటాక్ట్ లెస్ టికెట్ సిస్టంను కేంద్రం తేబోతోందనీ, మెట్రో రైలు కార్డుల్ని మాత్రమే వాడేందుకు అనుమతి ఇస్తుందని తెలిసింది.
- ఈసారి బార్లలో కౌంటర్ దగ్గర లిక్కర్ అమ్మేందుకు అనుమతి ఇస్తారనీ అయితే... టేక్ ఎవే సర్వీసులకు మాత్రమే అనుమతిస్తారని తెలిసింది. బార్లు కూడా మార్చి 25 నుంచి మూసి ఉన్నాయి.
- స్కూళ్లు, కాలేజీలు మాత్రం సెప్టెంబర్‌లో కూడా మూసే ఉంటాయని తెలిసింది.ఐఐటిలు, ఐఐఎంలు మాత్రం తెరుచుకుంటాయని సమాచారం. అలాగే జేఈఈ, నీట్ నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని కేంద్ర ఇప్పటికే తెలిపింది. మిగతా పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలదే బాధ్యత అని తేల్చిచెప్పారు. ఇక, ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. ఆన్‌లైన్ క్లాసులపై అంతా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పాడనున్నది.
- థియేటర్లు, ఆడిటోరియంలు మరో నెలపాటూ మూసే ఉంచుతారని సమాచారం. ఇప్పుడు సినిమా హాళ్లను తెరిస్తే... 25 నుంచి 30 శాతం కెపాసిటీతోనే సినిమాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అది ఎంతమాత్రం లాభదాయకం కాదు. కావున అన్‌లాక్ 4.0లో కూడా థియేటర్లకు ఛాన్స్ లేనట్లే అని తెలిసింది. కానీ సినిమా , సిరీయల్స్ షూటింగ్స్ కు అనుమతులు ఇవ్వనున్నది.
- సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, అకడమిక్, కల్చరల్, మతపరమైన సమావేశాలు, సభలు, ఫంక్షన్లు, వేడుకలు, పెద్ద ఎత్తున జనం గుమికూడటాలు వంటివాటికి... సెప్టెంబర్ తర్వాత కూడా అనుమతి ఉండదని తెలుస్తోంది.
- కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రకారం... కంటైన్‌మెంట్ జోన్లలో... అన్‌లాక్-4లో కూడా కఠినమైన లాక్‌డౌన ఉంటుంది. వాటిని నిరంతరం మానిటరింగ్ చేస్తూనే ఉంటారు.
- కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేశాక... వాటిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. అందువల్ల కేంద్రం అనుమతించినా... కొన్ని రాష్ట్రాలు అనుమతించకపోవచ్చు.