Unlock 3.0: లాక్‌డౌన్‌తో అత్యంత నష్టాల్లో కూరుకుపోయిన థియేటర్లు అన్‌లాక్ త్రీలో ఓపెన్ కానున్నాయి. సినిమా హాల్‌లను తెరిచేందుకు గైడ్‌లైన్స్ రూపొందిస్తున్నారు. అయితే థియేటర్ల సీటింగ్ కేపాసిటీకి కేవలం 25 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారనే వార్తలపై యాజమాన్యాలు, పరిశ్రమకు చెందిన పెద్దలు భగ్గుమంటున్నాయి. ఇన్నాళ్ల నష్టాలకు తోడు మరిన్ని కష్టాలు కొనితెచ్చుకోవడమే అని అంటున్నాయి.
ఆగస్టు ఫస్ట్ నుంచి దేశంలో అన్‌లాక్ త్రీ స్టార్ట్ కానుంది. దీంతో మార్గదర్శకాలు రూపొందిస్తున్న కేంద్ర హోం శాఖ ఈ దఫాలో థియేటర్లను కూడా తెరిచేందుకు సిద్ధమవుతున్నట్లు హింట్ ఇచ్చింది. ఈ వార్తతో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సినీ పరిశ్రమ పెద్దలు, థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్స్ సంతోష పడ్డారు. అయితే వారి సంతోషం అంతలోనే ఆవిరయ్యేలా కనిపిస్తోంది.
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన విజ్ఞప్తితో కేంద్రప్రభుత్వం సినిమా ధియేటర్ల రీ ఓపినింగ్ కు అవకాశం ఇస్తుంది. అయితే 25 శాతం ప్రేక్షకులతో సినిమాలు నడపాలంటూ మెలిక పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపైనే సీని పెద్దలు పెదవి విరుస్తున్నారు. అసలు థియేటర్లు స్టార్ట్ అయితే ఇప్పటికిప్పుడు ప్రేక్షకులు వస్తారో రారో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో కేవలం 25 శాతానికి సీటింగ్ పరిమితం చేస్తే ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు నిర్మాతలు. కనీసం 50 శాతం వరకు పెంచాలని సూచిస్తున్నారు.
అయితే ఇక నుంచి థియేటర్లు తెరిస్తే కొత్త నిబంధనలు పాటించాల్సి వస్తుంది. భౌతికదూరం, కాగిత రహిత టికెటింగ్ విధానం, శానిటైజింగ్ వంటి చర్యలతో ఖర్చులు పెరగునున్నాయి. అలాగే సినిమాలను బట్టి ప్రేక్షకులు వస్తుంటారు. చిన్న సినిమాలైతే ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఇన్ని నియంత్రణల మధ్య 25 శాతం సీటింగ్‌కు పరిమితి ఇవ్వడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు ఎలాంటి లాభం లేదంటున్నారు.