Unlock 2.0 Guidelines: జమ్మూ కాశ్మీర్ లో 'అన్‌లాక్' కొత్త మార్గదర్శకాలు..
Unlock 2.0 Guidelines: జమ్మూ కాశ్మీర్ లో 'అన్‌లాక్' 2.0 కు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
Unlock 2.0 Guidelines: జమ్మూ కాశ్మీర్ లో 'అన్‌లాక్' 2.0 కు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈరోజు (జూలై 4) నుండి అమల్లోకి వచ్చే ఈ దశలో మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య అనవసర కార్యకలాపాల కోసం వ్యక్తుల కదలికను పరిమితం చేసింది. కొత్త మార్గదర్శకాలు కంటైనర్ జోన్లు లేదా హాట్‌స్పాట్‌లు మినహా అన్ని షాపింగ్ మాల్‌లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క విధానాలకు లోబడి తెరవాలని ఆదేశాలు ఇచ్చింది. ఏదేమైనా, రెడ్ జోన్ ప్రాంతంలో 50% షాపులు మాత్రమే రోజులో తెరవాలని పేర్కొంది.
ఇది సంబంధిత డై కమిషనర్లచే నియంత్రించబడతాయని పేర్కొంది, మాల్స్‌లోని షాపులు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరుచుకోవచ్చు. హోటళ్లతో సహా అన్ని రెస్టారెంట్లు ఫుడ్ ను హోమ్ డెలివరీ చేస్తాయి, అయితే ఇక్కడ కూడా రోజులో 50 శాతం వరకు మాత్రమే పరిమితి ఉంది. కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమతి పొందిన వాహనాలను మాత్రమే తిరిగేందుకు వీలుంది.. అంతరాష్ట్ర వాహనాలకు కూడా ఇదే విధానం అమలులో ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో సెక్షన్ 144 సిఆర్‌పిసి కింద జిల్లా న్యాయాధికారులు నిర్దిష్ట నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తారు.
జమ్మూ కాశ్మీర్‌లో వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి, OVID-19 RT-PCR పరీక్షను తప్పనిసరిగా నిర్వహించాలని స్థానిక పరిపాలన నిర్ణయించింది, అయితే ఇందులో ఫలితం నెగటివ్ వచ్చినా కూడా 14 రోజుల వరకూ దిగ్బంధంలో ఉండాలని పేర్కొంది. ఇక రాష్ట్రానికి వచ్చే వారందరికి కరోనా పరీక్షలు చెయ్యాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇదిలావుంటే కాశ్మీర్ ప్రావిన్స్‌లోని బండిపోరా జిల్లా , జమ్మూ ప్రావిన్స్‌లోని రాంబన్ జిల్లా రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని, సాంబా, గండర్‌బాల్, పూంచ్ తదితర ప్రాంతాలు ఆరెంజ్ జోన్ పరిధిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. దోడా , కిష్త్వార్ జిల్లాలు మాత్రమే గ్రీన్ జోన్ పరిధిలో ఉన్నాయి. కాగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా 170 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, దీంతో ఇక్కడ మొత్తం కేసులు 8,000 మార్కును దాటాయి.