అన్ లాక్ 1.0 ఇలా.. కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసినంత చేశాయి. ఆర్థిక సంక్షోభాన్ని లెక్కచేయకుండా మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించి, కట్టడికి తమ వంతు ప్రయత్నం చేశాయి.
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసినంత చేశాయి. ఆర్థిక సంక్షోభాన్ని లెక్కచేయకుండా మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించి, కట్టడికి తమ వంతు ప్రయత్నం చేశాయి. ఇంత చేసినా వైరస్ వ్యాప్తిని కట్టడి కష్టతరంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే రోజుకు పది వేలకు మించి కేసులు నమోదవుతున్నాయి. ఇదే మాదిరి కొనసాగితే వీరికి వైద్య సేవలందించేందుకు హస్పటళ్లు కొరత ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో రోగులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రత్యేకంగా ఆన్ లాక్ 1.0ను అమల్లోకి తెచ్చింది. భవిషత్తులో కరోనా సోకితే ఇంటి వద్దే ఉండి చికిత్స అందించేలా నిబంధనలను రూపొందించింది. లాక్ డౌన్ మాదిరిగానే వీటిని ఖచ్చితంగా అమలు చేసేలా షరతులు విధించింది.
కొత్త ఆలోచన..
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో ప్రతిరోజూ దాదాపు 10,000 కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల ట్రీట్మెంట్ కు మన దగ్గర ఉన్న ఆసుపత్రి వనరులు సరిపోయే అవకాశం సన్నగిల్లుతోంది. అందుకే కేంద్రం కొత్త ఆలోచన చేసింది. నిజానికి ఇది మనకు కొత్త కానీ, విదేశాల్లో ఎప్పటినుంచో ఉంది. దీని ప్రకారం కరోనా సోకిన వ్యక్తిని ఆసుపత్రిలొ చేర్చారు. అతని ఇంటివద్దే ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇందుకు కుటుంబసభ్యులు సహకరించాల్సి ఉంటుంది. దీనికోసం కేంద్రం తాజాగా అన్ లాక్ 1.0 లో భాగంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దాని ప్రకారం ఇకపై ఎవరికైనా కరోనా సోకితే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించనుంది. రోజూ డాక్టర్లు ఫోన్ చేసి ఏయే మందులు వాడాలో సూచించటంతో పాటు అప్పుడప్పుడూ వచ్చి చూస్తారు. మొత్తం 17 రోజులపాటు రోగులకు చికిత్స ఉంటుంది. పరిస్థితి విషమిస్తే టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలి. అప్పుడు వైద్య సిబ్బంది కరోనా రోగులను ఆస్పత్రికి తీసుకెళతారు. ఇక ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఎలా వ్యవహరించాలనే దానిపైన కూడా కేంద్రం కొన్ని సూచనలు చేసింది..
వైరస్ సోకిన వారికి పిల్లలు, ముసలివాళ్లను దూరంగా ఉంచాలని చెప్పింది. ఇంట్లో ఉన్న కరోనా రోగికి గాలి బాగా తగిలేలా చేయడంతో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక బాత్ రూం సదుపాయం కల్పించాలి. డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా వాడాలి. కరోనా రోగి గది నుంచి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరిగా వాడాలి. రోజుకు కనీసం 2 లీటర్ల గోరు వెచ్చని నీటిని తాగాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ఇంట్లో ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే 18005994455 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలి.