కేంద్రం, రైతు సంఘాల మధ్య మొదలైన చర్చలు.. ఈ సారైనా ప్రతిష్టంభన తొలుగుతుందా?
*చర్చల్లో పాల్గొన్న 41 రైతు సంఘాల నేతలు *తొమ్మిది విడతల చర్చల్లో తొలగని ప్రతిష్టంభన *వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే అంటోన్న రైతు సంఘాలు
కేంద్రం, రైతు సంఘాల మధ్య పదోవిడత చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న చర్చల్లో 41 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ చర్చలకు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన తొమ్మిది విడతల చర్చల్లో.. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన వీడలేదు. దీంతో ఈ సారైనా కేంద్రం, రైతు సంఘాలు మధ్య చర్చలు కొలిక్కి వస్తాయా లేదో చూడాలి.