ప్రతిపక్షాలు డ్రామాలు ఆపాలి : స్మృతి ఇరానీ
Smriti Irani Slams Rahul Gandhi : హత్రాస్ ఘటన పైన కాంగ్రెస్ తో సహా ప్రతి పక్షాలు చేస్తున్న ఆందోళనలు, విమర్శల పైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు..
Smriti Irani Slams Rahul Gandhi : హత్రాస్ ఘటన పైన కాంగ్రెస్ తో సహా ప్రతి పక్షాలు చేస్తున్న ఆందోళనలు, విమర్శల పైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.. ఈ క్రమంలో ఆమె రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.. భాదితులకి న్యాయం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ ఈ ఈ యాత్రలు చేస్తున్నారని ఆమె వాఖ్యానించారు.. భాదితురాలకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రతిపక్షాలు డ్రామాలు ఆపాలని ఆమె అన్నారు. అటు కాంగ్రెస్ వ్యూహాల గురించి ప్రజలకు తెలుసునని, అందుకే ప్రజలు 2019 ఎన్నికలలో బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని కల్పించారని అన్నారు.
హత్రాస్ సంఘటన పైన ఆమె మాట్లాడుతూ.. బాధితురాలుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు. సిట్ దర్యాప్తు తర్వాత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసు అధికారులపై కూడా తాము చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆమె చేసిన వ్యాఖ్యలకు అసంతృప్తితో ఉన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వారణాసిలో ఆమె కారును ఆపడానికి ప్రయత్నించారు. "స్మృతి ఇరానీ తిరిగి వెళ్ళు .. మేము న్యాయం కోరుకుంటున్నాము" అనే నినాదాలని వినిపించారు.
అటు బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఈ రోజు మధ్యాహ్నం హత్రాస్‌ను సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. 'దు:ఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబానికి ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తి నన్ను అడ్డుకోలేదు' అని రాహుల్ ట్వీట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అసమర్థతలకు నిరసనకి గాను అక్టోబర్ 5న దేశవ్యాప్తంగా సత్యాగ్రహాన్ని చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఇది ఇలా ఉంటే గురువారం హత్రాస్ వెళ్ళేందుకు ప్రియాంక, రాహుల్ ప్రయత్నించగా పోలీసులు యమునా ఎక్స్‌ప్రెస్ వే పై అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాటలో రాహుల్ కింద పడిపోయారు.