Union minister Gajendra Singh Shekhawat served notice: ఆడియో టేప్ వ్యవహారం.. కేంద్ర మంత్రి షేఖావత్ కు నోటీసు

Union minister Gajendra Singh Shekhawat served notice: రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ కు సంబంధించిన వైరల్ అయిన ఆడియో టేప్ కేసులో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజి) దర్యాప్తు ముమ్మరం చేసింది.

Update: 2020-07-20 10:23 GMT
Union minister Gajendra Singh Shekhawat served notice

Union Minister Gajendra Singh Shekhawat served notice: రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ కు సంబంధించిన వైరల్ అయిన ఆడియో టేప్ కేసులో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజి) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్‌కు ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో ఆయనకు నోటీసు ఇచ్చింది. షేఖావత్ తరపున ఆయన కార్యదర్శికి అధికారులు నోటీసు ఇచ్చారు. ఇదిలాఉండగా, రాజస్థాన్ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. రాజస్థాన్ ATS, SOG బృందానికి సహకరించాలని హర్యానా పోలీసులను ఆదేశించాలని కోరింది.

అంతకుముందు వైరల్ ఆడియోలో గజేంద్ర సింగ్ షేఖావత్ ఆడియో నకిలీదని చెప్పారు. కావాలనే తనపేరు బయటకు తెచ్చారని అన్నారు. ఈ ఆడియోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వదిలినట్టు ఆయన ఆరోపించారు. తనకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని అయన వివరణ ఇచ్చారు.

కాగా ఆడియో వైరల్ అయిన తరువాత, SOG లో భన్వర్లాల్ శర్మ, గజేంద్ర సింగ్ మరియు సంజయ్ జైన్ లపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశారు. ఇందులో సిఐడి క్రైమ్ బ్రాంచ్ మరియు ఎటిఎస్-ఎస్ఓజి కలిసి పనిచేస్తున్నాయి.

మరోవైపు సచిన్ పైలట్‌తో సహా 19 మంది ఎమ్మెల్యేల కోసం వెతుకుతున్న ఎస్‌ఓజి బృందం ఆదివారం ఢిల్లీకి చేరుకుని అనేక హోటళ్లలో శోధించినప్పటికీ వారి జాడ కనబడలేదు. అయితే పైలట్ క్యాంప్ హర్యానాలోని మనేసర్లో ఉందని.. తెలుసుకున్న అధికారులు వారిని కలిసేందుకు అక్కడికి వెళ్లినట్టు తెలిసింది.


Tags:    

Similar News