Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో పొలిటికల్ హీట్
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన
Jammu and Kashmir: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. జమ్మూకాశ్మీర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని పహారీలకు షెడ్యూల్ తెగ హోదాను ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పోలిటికల్ గా హీట్ ను పెంచింది. పహారీలకు షెడ్యూల్ తెగ హోదా ఇవ్వడంపై PDP నాయకురాలు మెహబూబా ముఫ్టీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ ఈ విధంగా చేస్తోందని ఆరోపించారు.
జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ, బారాముల్లా, హంద్వారా జిల్లాల్లో పహారీలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వీరు పహారీ భాషను మాట్లాడతారు. షెడ్యూల్ తెగగా గుర్తించాలని చాలా కాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ షెడ్యూల్ తెగకు చెందిన వారిగా వీరిని గుర్తిస్తే భాషా ప్రతిపాదికన ఒక సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించినట్లు అవుతుంది. కానీ, ఈ వినతిని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు పహారీలను షెడ్యూల్ తెగ కిందకు తీసుకొచ్చే అంశంపై అమిత్ షా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.