ఈరోజు రైతు సంఘాలతో కేంద్రం 10వ దఫా చర్చలు
* మధ్యాహ్నం 2గంటలకు విజ్ఞాన్ భవన్‌లో సమావేశం * నూతన సాగుచట్టాల రద్దు, ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలంటూ అన్నదాతల డిమాండ్ * ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులతో పలు విడతలుగా చర్చలు
ఇవాళ రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. 10వ విడత చర్చలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభం కానున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశరాజధానిలో రైతులు 56 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపినా.. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.
ఇక రైతు చట్టాలను రద్దు చేసేదాకా ఎట్టిపరిస్థితుల్లో నిరసన విరమించేంది లేదంటున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా సమస్య పరిష్కారానికి నలుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.