Union Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ భేటీ

Union Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఉదయం 11 గంటలకు భేటీ కానుంది.

Update: 2021-06-16 01:54 GMT

Prime Minister Modi:(File Image)

Union Cabinet: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 11 గంటలకు వర్చువల్‌ విధానంలో సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా కరోనాతో కుదేలైన ఆర్ధిక పరిస్థితిపై కూడా చర్చించనుంది. మరో మూడు, నాలుగేళ్ల వరకు కుదుట పడని పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అవసరమైన ప్రణాళికలు, ఉద్దీపన ప్యాకేజీలతో చర్యలకు ఉపక్రమించాలని కేంద్రం చూస్తోంది. కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాపిస్తుందన్న హెచ్చరికలతో కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలతో పాటు లాక్ డౌన్ విషయంలో కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇవాళ భేటీ కాబోతుంది.

లాక్ డౌన్ కారణంగా దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు చాలా దెబ్బతిన్నాయి. దేశ జీడీపీ మైనస్‌ లోకి పడిపోతుందన్న ఆందోళనను ఆర్థిక వేత్తలు వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు… రాష్ట్రాల డిమాండ్‌ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.

దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. కరోనా టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా కేంద్రీకృతంగా సాగుతుందని తెలిపారు. వ్యాక్సిన్‌ ప్రక్రియలో గత నెలలో చేసిన సవరణలకు స్వస్తి పలుకుతున్నామని చెప్పారు. దీంతో ఈ భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News