కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలిపేందుకు అనుమతి..
Union Cabinet: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Union Cabinet: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారత్న, నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించాలని నిర్ణయించింది. ఉపసంహరణ నిర్ణయాధికారాన్ని సంస్థ డైరెక్టర్లకు అప్పగించింది. ఇక వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రమేయం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బయో ఫ్యూయల్ పాలసీలో పలు మార్పులు చేయనుంది. 2030 కల్లా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపేందుకు అనుమతించింది.