Union Budget 2021 : రాష్ట్రపతిని కలిసి పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్
కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బృందం పార్లమెంట్‌కు బయల్దేరింది. అంతకుముందు ఈ బృందం ఆర్థికశాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతిభవన్‌కు చేరుకుంది. ప్రొటోకాల్ ప్రకారం దేశ ప్రథమపౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ గురించి వివరించారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రసంగం 90 నుంచి 120 నిమిషాలు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సారి బడ్జెట్‌ను మొదటిసారి కాగితం రహితంగా.. డిజిటల్ విధానంలో సభ్యులకు పంపిణీ చేయనున్నారు. సాధారణ ప్రజల కోసం పత్రాల కోసం ఇబ్బంది లేకుండా ఈ సారి కేంద్రం మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది. శుక్రవారం నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం కుదించగలదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 11 శాతం నమోదు చేయగలదని సర్వే పేర్కొంది.