యోగిజీ.. మీ అక్కలా చెబుతున్నా.. దయచేసి అనుమతి ఇవ్వండి!
Uma Bharati Tells Yogi Adityanath : దేశంలో మరో నిర్భయ ఘటనగా ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ హత్యాచార ఘటన మారింది. ఈ ఘటన పైన యూపీ ప్రభుత్వం పైన విపక్షాలు, వామపక్షాలు మండిపడుతున్నాయి.
Uma Bharati Tells Yogi Adityanath : దేశంలో మరో నిర్భయ ఘటనగా ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ హత్యాచార ఘటన మారింది. ఈ ఘటన పైన యూపీ ప్రభుత్వం పైన విపక్షాలు, వామపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ నాయకురాలు ఉమాభారతి కూడా యూపీ పోలిసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ పోలిసుల తీరు సీఎం అధిత్యనాథ్ కి మాత్రమే కాకుండా బీజేపీ పార్టీ కూడా మచ్చ తెచ్చిందని ఆమె అన్నారు. హత్రాస ఘటన బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించాలని ఆమె సూచించారు.
ఇటీవల మనం ( బీజేపీ ) రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేసి దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. కానీ హత్రాస్ ఘటనలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పార్టీకి కూడా మచ్చను తెస్తోంది. అంటూ ఆమె హిందీలో వరుస ట్వీట్లు చేశారు. ముందుగా ఈ ఘటన జరిగినప్పుడు మీరు చర్యలు తీసుకుంటారని భావించి ఏమీ మాట్లాడలేదని, కానీ ఘటన పైన పోలిసుల తీరును చూస్తే బాధాకరంగా ఉందని అన్నారు. సిట్ దర్యాప్తు జరుగుతున్నందున బాధితురాలు కుటుంబం ఎవరితో కలవకూడదనే నిబంధన ఏమైనా ఉందా? ఇలాంటి ఘటనల వల్ల సిట్ దర్యాప్తుపై కూడా అనుమనాలు తలెత్తుతాయని ఆమె అన్నారు."మీరు చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న అడ్మినిస్ట్రేటర్" అని ఉమాభారతి ఆదిత్యనాథ్ కు ట్వీట్ చేశారు.
అటు కరోనా పాజిటివ్ వచ్చినందువలన తానూ రిషికేశ్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నట్లుగా వెల్లడించారు ఉమాభారతి.. ఒకవేళ తనకి కరోనా పాజిటివ్ కాకపోతే, తానూ ఆ గ్రామంలో ఆ కుటుంబంతో కూర్చుని ఉండేదానిని అని ఆమె వెల్లడించారు..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కచ్చితంగా భాదితురాలు కుటుంబాన్ని పరామర్శిస్తానని ఉమాభారతి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఒక పార్టీ సీనియర్ నాయకురాలుగా, మీకు అక్కాలగా చెబుతున్నాను.. ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని కలిసేందుకు రాజకీయనాయకులు, మీడియా వ్యక్తులను అనుమతించాలని, తన సూచనను తిరస్కరించవద్దని సీఎం యోగిని ఆమె కోరారు!