బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. బ్రిటన్‌లో కొవిడ్ స్ట్రెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోరిస్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు బోరిస్ భారత్‌కు రావడానికి గత నెలలోనే అంగీకరించారు. స్ట్రెయిన్ కలవరపరుస్తున్న తరుణంలో భారత్ పర్యటనకు రాలేని బోరిస్ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్న విషయం పై సందిగ్ధత నెలకొంది. 1993లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు అప్పటి బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ హాజరయ్యారు.