Aadhar Alert: ఆధార్‌ కార్డు అలర్ట్‌.. ఇవి అప్‌డేట్‌ చేయకుంటే అన్ని పనులు పెండింగే..!

Aadhar Alert: ఆధార్‌ కార్డు అలర్ట్‌.. ఇవి అప్‌డేట్‌ చేయకుంటే అన్ని పనులు పెండింగే..!

Update: 2022-10-20 12:28 GMT

Aadhar Alert: ఆధార్‌ కార్డు అలర్ట్‌.. ఇవి అప్‌డేట్‌ చేయకుంటే అన్ని పనులు పెండింగే..!

Aadhar Alert: ఈ రోజుల్లో ప్రతి పనికి ఆధార్‌ కార్డు అవసరం. అయితే చాలా మంది వ్యక్తుల ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ, లింగం, పేరు, ఇంటిపేరు అప్‌డేట్‌ చేయలేదు. దీని కారణంగా అనేక ప్రభుత్వ పథకాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలలో మాత్రమే కాకుండా ఈ రోజుల్లో ప్రైవేట్‌ రంగంలో కూడా ఆధార్‌ అవసరం పెరిగిపోయింది. ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఆధార్ కార్డుని ఆసరాగా చేసుకొని అనేక రకాల మోసాలు చేస్తున్నారు. అందువల్ల UIDAI ఈమెయిల్‌ను లింక్ చేయమని ప్రజలను కోరింది.

ఆధార్ కార్డును ఈ-మెయిల్ ఐడీతో అనుసంధానం చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. మీరు ఎక్కడ ఆధార్ కార్డును ఉపయోగిస్తే ఆ సమయంలో ఈమెయిల్‌కి హెచ్చరిక వస్తుంది. అంటే ఎవరైనా మీ ఆధార్‌ను తప్పుగా ఉపయోగిస్తే ఈ మెయిల్ ఐడి ద్వారా మీకు మెస్సేజ్‌ వస్తుంది. దీంతో ఎవరైనా మోసం సులువుగా తెలుసుకోవచ్చు.

ఆధార్ లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

మీరు మెయిల్ ఐడితో ఆధార్‌ను లింక్‌ చేసుకుంటే ఎవరైనా మీ ఆధార్‌ కార్డుని అనవసరమైన పనికి ఉపయోగిస్తే మీకు సులభంగా తెలుస్తుంది. ఇది కాకుండా మీ ఆధార్‌ను ఎక్కడ ఉపయోగించినా మీకు దాని హెచ్చరిక వస్తుంది. ప్రస్తుతం చాలా మంది సైబర్ మోసగాళ్లు ప్రజల నుంచి OTP తీసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు నేరాల్లోనూ ఆధార్‌ను వినియోగిస్తున్నారు.

ఇలా ఆధార్ లింక్ చేయండి

ఆధార్ కార్డ్‌లో ఈ-మెయిల్ ఐడీని అప్‌డేట్ చేయాలనుకుంటే మీరు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాళి. ఇంట్లో కూర్చొని ఈ పని చేయలేరు. మీ సమీప ఆధార్ కేంద్రం గురించి తెలుసుకోవడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. https://bhuvan.nrsc.gov.in/aadhaar/.

Tags:    

Similar News