నా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్ ఉద్వేగం..
Uddhav Thackeray: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఉద్వేగానికి గురయ్యారు.
Uddhav Thackeray: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఉద్వేగానికి గురయ్యారు. ముంబైలోని సెక్రటేరియట్‌లో జరిగిన కేబినెట్ భేటీ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించాలని సహచర కేబినెట్ మంత్రులతో అన్నారు. అంతేకాకుండా రెండున్నరేళ్లుగా మద్దతుగా నిలబడినందుకు ధన్యావాదాలు అంటూ ఆయన మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు.
తన వాళ్లే తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేబినెట్ భేటీని ముగించుకుని సచివాలయం బయటకు వచ్చిన ఉద్ధవ్ థాక్రే మీడియా ప్రతినిధులకు నమస్కారం చేసి వెళ్లిపోయారు. కేబినెట్ భేటీలో ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారన్నదిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.