Uber Ola: ప్రయాణ ఛార్జీలు పెంచిన Uber, Ola..!
Uber Ola: ప్రయాణ ఛార్జీలు పెంచిన Uber, Ola..!
Uber Ola: పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల పెరుగుదల ప్రభావం ఇప్పుడు క్యాబ్ ఛార్జీలపైనా పడింది. Uber తర్వాత ఇప్పుడు Ola కూడా ఎంపిక చేసిన నగరాల్లో ఛార్జీలను పెంచింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు ఎంత స్పీడ్‌గా పెరుగుతున్నాయో త్వరలోనే ఆటోలు, బస్సుల చార్జీలు కూడా పెరగనున్నాయి.
ఓలా ఛార్జీలను పెంచింది..
క్యాబ్ ప్రొవైడర్ Ola అనేక నగరాల్లో ఛార్జీలను పెంచింది. కంపెనీ తన డ్రైవర్లకు ఈ-మెయిల్ కూడా చేసింది. హైదరాబాద్‌లోని డ్రైవర్లకు పంపిన ఈ-మెయిల్‌లో మినీ, ప్రైమ్ క్యాబ్ సేవల ఛార్జీలను 16 శాతం వరకు పెంచినట్లు సమాచారం. అయితే ఈ సమాచారాన్ని కంపెనీ ఇంకా పబ్లిక్ చేయలేదు. ఏ నగరంలో ఎంత ఛార్జీలు పెంచారో వెల్లడించలేదు. అయితే హైదరాబాద్‌లోని డ్రైవర్లకు ఈ-మెయిల్ పంపిన తర్వాత ఇతర నగరాల్లో కూడా ఇదే తరహాలో ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఉబర్ ఛార్జీలను పెంచింది
ఇంతకుముందు ఓలా ప్రత్యర్థి సంస్థ ఉబెర్ కూడా దేశంలోని అనేక నగరాలలో తన ఛార్జీలను పెంచింది. పెట్రోలు, సిఎన్‌జి ధరల నిరంతర పెరుగుదల తమ లాభాలను తగ్గించినందున చాలా కాలంగా ఓలా, ఉబర్‌ల క్యాబ్ డ్రైవర్లు ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పెట్రోలు ధర లీటరుకు రూ.100 దాటగా కేవలం 15 రోజుల్లోనే CNG ధర కూడా కిలోకు సుమారు రూ.15 పెరిగింది. అందుకే ఆర్టీసీ, ఆటోడ్రైవర్లు కూడా ఛార్జీలను పెంచుతున్నారు.