UAE Ban Travel: భారత్ సహా 14 దేశాలకు ప్రయాణ నిషేధం విధించిన యూఏఈ

UAE Ban Travel: జూలై 21 వరకు భారత్ సహా 14 దేశాలకు వెళ్లవద్దని యుఎఈ పౌరులకు ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2021-07-02 04:20 GMT

UAE Bars Citizens From Travelling:(File Image)

UAE Ban Travel: యావత్ ప్రపంచాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ వణించింది. అది కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పటికే అనేక దేశాల పై పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో యూఏఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జూలై 21 వరకు ఈ దేశాలకు వెళ్లవద్దని యుఎఈ పౌరులకు ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక పేర్లు ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ, జాతీయ అత్యవసర, సంక్షోభ, విపత్తు నిర్వహణ అథారిటీ ఈ సమాచారం తెలియజేసింది.

దీంతో పాటు కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి (యుఎఇ ట్రావెల్ బాన్) ప్రయాణించేటప్పుడు అన్ని నివారణ చర్యలను అనుసరించాలని దేశ పౌరులను కోరారు. గురువారం ఈ ఉత్తర్వుకు ముందు 14 దేశాలకు విధించిన ప్రయాణ నిషేధాన్ని జూలై 21 వరకు పొడిగించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సివిల్ ఏవియేషన్ అథారిటీ 14 దేశాల నుంచి లైబీరియా, నమీబియా, సియెర్రా లియోన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, జాంబియా, వియత్నాం, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నైజీరియా, దక్షిణాఫ్రికాలకు జూలై 21 వరకు విమానాలు నిలిపివేస్తారు. అయితే కార్గో విమానం, వ్యాపార సంబంధిత విమానాలు, చార్టర్డ్ విమానాలను ఈ పరిమితుల నుంచి మినహాయించారు.

Tags:    

Similar News