Twitter War: కేటీఆర్ ట్వీట్లకు కేంద్రమంత్రి కౌంటర్ ట్వీట్లు

Twitter War: 56వేల కోట్లు వసూలు చేసి ఏం చేశారన్న కేంద్రమంత్రి

Update: 2022-04-29 05:37 GMT

Twitter War: కేటీఆర్ ట్వీట్లకు కేంద్రమంత్రి కౌంటర్ ట్వీట్లు

Twitter War: పెట్రో ధరలపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య వార్ ముుదురుతోంది. అందుకు ట్విట్టర్ ను వేదికగా మార్చుకున్నారు. మొన్న ప్రధాని మోడీ సీఎంలతో జరిగిన వర్చువల్ మీట్ లో. పెట్రో ధరలు తగ్గాలంటే రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని రిక్వెస్టు చేశారు. తాము ఎక్సైజ్ పన్ను తగ్గించామని, రాష్ట్రాలు కూడా కొంత వ్యాట్ తగ్గిస్తే పేదప్రజలకు రిలీఫ్ దొరుకుతుందని మోడీ సూచించారు. దీనిపై బీజేపీయేతర రాష్ట్రాలు భగ్గుమన్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రం మీద దాడి చేశారు. ఒకే దేశం-ఒకే ధర ఉండాలంటే కేంద్రం విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని, అప్పుడు పెట్రోల్ 70 రూపాయలకు, డీజిల్ 60 రూపాయలకే ఇవ్వొచ్చని చురకలంటించారు. మీ సెస్సుల కారణంగా రాష్ట్రాలకు రావాల్సిన వాటా రావడం లేదన్నారు. ఇంధన ధరల్ని కేంద్రమే పెంచుతూ మరోవైపు రాష్ట్రాలు ఫెడరలిజం స్ఫూర్తి ప్రదర్శించాలనడంలో ఏం అర్థముంది మోడీగారూ అంటూ కాస్త ఘాటుగానే కేటీఆర్ దాడి చేశారు.

ఇక కేటీఆర్ దాడికి కౌంటర్ గా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా అదే స్థాయిలో రియాక్టయ్యారు. దేశంలో ఎక్కడా లేనంత వ్యాట్ తెలంగాణలో విధించారని ట్వీట్ చేశారు. పెట్రోల్ పై 35.20 శాతం, డీజిల్ పై 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా చెప్పారు. ఈ వ్యాట్ వల్ల 2014 నుంచి 2021 వరకు 56 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్ము గుంజారన్నారు. గతేడాది నష్టాలు పూడ్చుకునేందుకు 13 వేల కోట్ల రాబట్టే నెపంతో 69 వేల కోట్లు రాబట్టారని ఎదురుదాడి చేశారు పూరీ. హర్దీప్ సింగ్ ట్వీట్ నే ట్యాగ్ చేస్తూ బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు డీకే అరుణ ప్రజల నుంచి రాబట్టిన ఆ సొమ్మంతా ఏమైంది. నీ కుటుంబానికి పంచినవా.. ఫాంహౌస్ లో పదిలపరిచినవా అంటూ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 

Tags:    

Similar News