ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు తీసుకోకుండా ఆపలేం- Delhi HC
Delhi HC: భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐటీ చట్టాలను పాటించాల్సిందే అని ట్విట్టర్‌కు తెలిపింది ఢిల్లీ హైకోర్టు.
Delhi HC: భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐటీ చట్టాలను పాటించాల్సిందే అని ట్విట్టర్‌కు తెలిపింది ఢిల్లీ హైకోర్టు. కేంద్రం చర్యలు తీసుకోకుండా తాము రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ట్విట్టర్ సంస్థ కొత్త నిబంధనలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా కొత్త నిబంధనలు ప్రకారం జులై 6న తాత్కాలిక చీఫ్ కంప్లియెన్స్ అధికారిని నియమించామని తెలిపింది ట్విటర్. మరో ఎనిమిది వారాల్లో పూర్తి స్థాయిలో అధికారులను నియమిస్తామని చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రెండు వారాల్లో సమర్పించాలని తెలిపింది ఢిల్లీ హైకోర్టు.