Twitter: భారత్‌లో ట్విట్టర్‌కు భారీ షాక్
Twitter: కొత్త ఐటీ రూల్స్ ప్రకారం స్టాట్యుటరీ అధికారులను నియమించనందున ట్విటర్ లీగల్ ప్రొటెక్షన్ ను రద్దు చేసింది కేంద్రం.
Twitter: ఇండియాలో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం స్టాట్యుటరీ అధికారులను నియమించడంలో ట్విటర్ విఫలమైనందున లీగల్ ప్రొటెక్షన్ (నాయపరమైన రక్షణ) ను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఇండియాలో కీ ఆఫీసర్లను నియమించాలన్న నూతన సోషల్ మీడియా నిబంధనలను ఇది పాటించలేదని ఐటీ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాము ఈ విషయమై లేఖ రాసినప్పటికీ సరిగా స్పందించలేదని తెలిపింది. అనుచితమైన, అసభ్యకర కంటెంట్ పర్యవేక్షణకు ముఖ్యంగా నోడల్ ఆఫీసర్లను నియమించాలని ఈ శాఖ గతంలోనే కోరింది.
భారత ప్రభుత్వ రూల్స్ ప్రకారం తాము తాత్కాలిక చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్ ను నియమించామని ట్విటర్ నిన్న తెలియజేసింది. కానీ ఇది సందిగ్ధంగా ఉందని ప్రభుత్వం భావించింది. లీగల్ ప్రొటెక్షన్ అంటే..ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద ఈ సామాజిక మాధ్యమంలో కింది స్థాయి ఉద్యోగుల నుంచి హెడ్ వరకు ఎవరు ఏ చట్టాన్ని అతిక్రమించినా వారికి న్యాయపరమైన రక్షణ ఉండదని సైబర్ లా నిపుణుడు ఒకరు చెప్పారు.
తన తప్పొప్పులను ట్విటరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అంటే లయబిలిటీల నుంచి సోషల్ మీడియాకు ఇచ్చే ఇమ్యూనిటీ ..ఇంటర్ మీడియా స్టేటస్ ను తొలగించినట్టే… తాము న్యాయపరమైన అంశాలకు అతీతులమనే వాదనకు ఇక బలం ఉండదు. ఎవరు (థర్డ్ పార్టీ) దీనిపై కేసు పెట్టినా దీనికి న్యాయపరమైన రక్షణ ఉండదని ఆ నిపుణుడు వివరించారు.