Twitter: కేంద్ర మంత్రికే ఝలక్ ఇచ్చిన ట్విటర్

Twitter: భారత ఐటీ రూల్స్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ మధ్య వివాదం పీక్స్‌కు చేరింది.

Update: 2021-06-25 10:45 GMT

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్(ఫైల్ ఇమేజ్ )

Twitter: భారత ఐటీ రూల్స్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ మధ్య వివాదం పీక్స్‌కు చేరింది. గతంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య సహా పలువురి ట్విట్టర్ ఖాతాల బ్లూ టిక్‌లు తీసివేసిన ట్విట్టర్ తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ను గంటపాటు నిలిపివేసింది. అమెరికా చట్టాల ప్రకారం ఖాతాను గంటపాటు నిలిపివేసినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే, అకౌంట్ నిలిపివేసే అంశంలో మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ట్విట్టర్ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని తెలుస్తోంది.

Tags:    

Similar News