రైతులకు మద్దతుగా చేస్తున్న ట్వీట్లను లైక్ చేసిన ట్విట్టర్ సీఈఓ
కేంద్రం ఫైర్ అవుతున్న వేళ ట్విట్టర్ సీఈఓ వెనక్కు తగ్గట్లేదు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల పోరాటం సామాజిక యుద్ధానిక తెరలేపిందా..? ఇంటా బయటా వస్తున్న విమర్శలతో కేంద్రం ఎదురు దాడి ప్రారంభించిందా.. అంటే అవుననే చెప్పాలి. పాప్ సింగర్ రిహానా ట్వీట్‌తో మొదలైన సోషల్ మీడియా వార్.. గ్రెటా థన్‌బర్గ రంగంలోకి దిగడంతో మరింత ముదిరింది. టీమిండియా క్రికెటర్లు సచిన్, కోహ్లి సహా పలువురు రైతు ఉద్యమంపై సామాజిక మాద్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మరోవైపు.. కేంద్రం ఫైర్ అవుతున్న వేళ ట్విట్టర్ సీఈఓ వెనక్కు తగ్గట్లేదు. రైతు ఆందోళతో పాటు పాప్ స్టార్ రిహన్నాకు అనుకూలంగా వచ్చిన పలు ట్వీట్లను ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే లైక్ చేశారు. అమెరికా ఆధారిత వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో జర్నలిస్ట్ అయిన కరెన్ అతయా అనే మహిళా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రెండు పోస్టులను జాక్ లైక్ చేశారు. ఈ ట్వీట్‌లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఇక మరో ట్వీట్‌లో రైతు ఆందోళనపై స్పందించిన రిహన్నాను పొగుడుతూ చేసిన ట్వీట్‌ను జాక్ లైక్ చేశారు.