Twist In Vijay Mallya Case: విజయ్ మాల్యా కేసులో కీలక మలుపు!

Twist In Vijay Mallya Case: అప్పులు ఎగొట్టి విదేశాలకి చెక్కేసిన కింగ్‌ఫిషర్‌ మాజీ యజమాని విజయమాల్యా కేసులో కీలక మలుపు తిరిగింది. విజయ్ మాల్యా

Update: 2020-08-07 06:50 GMT
Vijay Mallya (File Photo)

Twist In Vijay Mallya Case: అప్పులు ఎగొట్టి విదేశాలకి చెక్కేసిన కింగ్‌ఫిషర్‌ మాజీ యజమాని విజయ్ మాల్యా కేసులో కీలక మలుపు తిరిగింది. విజయ్ మాల్యా కేసుకు సంబంధించిన పత్రాలు మాయం కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. భారత్‌లోని వివిధ బ్యాంకుల‌లో 9 వేల కోట్లు ఎగవేసిన కేసులో నిందితుడిగా విజయ్ మాల్యా ఆరోపణలు ఎదురుకుంటున్నారు.. ఎలాగైనా విజ‌య్ మాల్యాను తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం కేంద్రం తీవ్రంగా ప్రయత్నం ప్రయత్నం చేస్తోంది.. ఐతే, అతడి కేసుకు సంబంధించిన పేపర్స్ ఇప్పుడు కనిపించకపోవడంతో ప్రస్తుతానికి ఈ రివ్యూ పిటిషన్ విచారణను ఆగ‌స్టు 20వ తేదీకి వాయిదా వేశారు.

దీంతో గత మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను సంబంధిత కోర్టులో ఎందుకు లిస్టు చేయలేదో వివరించాల్సిందిగా జస్టిస్ లలిత్, భూషణ్‌లతో కూడిన ధర్మాసనం రిజిస్ట్రీని కోరింది.. ఇక విజయ్ మాల్యా తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది న్యాయ ఆదేశాలను ఉల్లంఘించినట్లు బ్యాంకులు పేర్కొన్నాయి.

ఇక విజయ్ మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకుల‌లో 9 వేల కోట్లు ఎగొట్టి 2016 మార్చి 2న యూకేకు పారిపోయాడు. ఇక 2019 జనవరిలో అర్ధిక అపరాధిగా ప్రకటించింది. త్వరలోనే ఇండియాకు విజయ్ మాల్యా రాకతప్పదని న్యాయనిపుణులు అంటున్నారు. 

Tags:    

Similar News