TB Cases in India: దేశంలో మరోసారి టీబీ అలజడి
TB Cases In India: రోజు రోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య
TB Cases In India: ఒకప్పుడు దేశాన్ని గడగడలాడించిన టీబీ ఇప్నుడు మళ్లీ దడ పుట్టిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో.. ఆస్పత్రులో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే సరైన పద్ధతిలో మందులు వాడకపోవడమే దీనికి కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే బాధితులు వ్యాధి ముదిరాక వస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో కొంత మంది ఒకటి, రెండ్రోజులు టాబ్లెట్స్ వాడి.. వ్యాధి తగ్గిందనే భ్రమలో ఉండి తీవ్రత పెంచుకుంటున్నారని అంటున్నారు. ప్రతి ఏటా 70వేలకు పైగా మందికి టీబీ సోకుతోందని, గతేడాదితో పోలిస్తే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు.
మరోవైపు ఇంట్లో ఒకరికి టీబీ ఉంటే సరైన జాగ్రత్తలు పాటించాలని.. లేనిపక్షంలో మిగతా వారందరికీ వ్యాధి సోకుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ చాలా కాలంగా దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. చాలావరకు లంగ్స్‌లో టీబీ వ్యాధి వస్తుందని, కానీ ఇటీవల ఇతర ఆర్గాన్స్‌కు సోకుతుందని తెలిపారు. కేంద్రం సాయంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు ఇస్తున్నారని, మందులను పక్కాగా వాడాలని హెచ్చరించారు. అలాగే టీబీ రోగుల పౌష్టికాహారం కోసం నెలకు ఐదు వందల రూపాయలు ఇస్తున్నట్టు చెప్పారు.