Chennai: పట్లాలు తప్పి ఫ్లాట్ ఫామ్‌పైకి దూసుకెళ్లిన సబర్బన్ రైలు
Chennai: చెన్నై బీచ్ రోడ్డులోని రైల్వే స్టేషన్‌లో ఘటన
Chennai: తమిళనాడు రాజధాని చెన్నైలో సబర్బన్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై బీచ్ రోడ్డులోని రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ రైలు పట్టాలు తప్పి ఫ్లాంట్ ఫాంపై ఉన్న దుకాణాల పైకి దూసుకెళ్లింది. రైలు ఢీకొన్న ఘటనలో నాలుగు దుకాణాలు ధ్వంసమయ్యాయి. గ్యారేజి నుంచి స్టార్టింగ్ పాయింట్‌కు వెళ‌్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అదృష్టవశాత్తూ రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.